నేను సక్సెస్‌ఫుల్ హీరో కావడానికి సురేఖనే కారణం: చిరంజీవి
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి మహిళలలపై ప్రశంసలు కురిపించారు. ప్రతీ మగాడి విజయం వెనుకాల స్త్రీ శక్తి ఉంటుందని అన్నారు. తాను సక్సెస్‌ఫుల్ హీరో కావడానికి తన సతీమణి సురేఖ ప్రధాన కారణం అని చిరంజీవి అన్నారు. తన సినిమాలపై వందశాతం దృష్టిపెట్టడానికి ఆమె సహకారం ఎంతో ఉందని తెలిపారు. మహిలా దినోత్ససవం సందర్భంగా హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని పలువురు మహిళా కార్మికులకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ వల్లే నేను స్త్రీ పక్షపాతిగా మారానని తెలిపారు. అలాగే స్త్రీ పక్షపాతిగా నిలవడానికి మరో కారణం సురేఖ అని వెల్లడించారు. మహిళలు కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయని.. చిన్నతనంలో తన తల్లి ఎంతో కష్టపడేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఈనాటి మహిళలు అంతరిక్షం, ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం పాటుపడాలన్నారు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నటించిన `ఆచార్య` విడుదలకు సిద్ధంగా ఉంది.