80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్
అటెండర్ నుండి ఆర్డీవో వరకు స్థానికులకు 95% రిజర్వేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం అసెంబ్లీ సమావేశంలో సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. అటెండర్ నుండి ఆర్డీవో వరకు స్థానికులకు 95% రిజర్వేషన్ కల్పించనుందని కెసిఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 91,142 ఖాళీలు ఉన్నాయి. 80,039 తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సిఎం తెలిపారు. మిగిలిన 11,103 మంది ఒప్పంద ఒద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖలో సుమారు 20వేలనుండి 30వేల వరకు పోస్టులు ఉన్నట్లు తెలిపారు.
హోంశాఖలో 18,334, పాఠశాల విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878, వైద్యారోగ్య శాలఖలో 12,755, బిసి సంక్షేమ శాఖలో 4,311 పోస్లుల భర్తీ చేయనున్నారు.
శాసనసభలో సిఎం మాట్లాడుతూ.. 95% స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సిఎం తెలిపారు . అటెండర్ నుండి ఆర్డీవో వరకు 95% స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 5% మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు.
Inter