TS: ఉద్యోగాల జాతర.. ఖాళీల వివరాలు..
ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలంటే...
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా తీపి కబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఖాళీలు ఉన్నాయి. 80,039 తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సిఎం తెలిపారు. మిగిలిన 11,103 మంది ఒప్పంద ఒద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖలో సుమారు 20వేలనుండి 30వేల వరకు పోస్టులు ఉన్నట్లు తెలిపారు.
ఖాళీల వివరాలు..
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన ప్రకారం శాఖల వారీగా వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,334, పాఠశాల విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878, వైద్యారోగ్య శాలఖలో 12,755, బిసి సంక్షేమ శాఖలో 4,311 పోస్లుల భర్తీ చేయనున్నారు.
రెవెన్యూ శాఖ -3,560
ఎస్సీ వెల్ఫేర్ శాఖ-2,879
ఎస్టి వెల్ఫేర్ శాఖ -2,399
నీటిపారుదల శాఖ -2,692
మైనారిటీ వెల్ఫేర్ -1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ & టెక్నాలజి -1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ -1,455
లేబర్, ఎంప్లాయిమెంట్- 1,221
ఆర్ధిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ -895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ -801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ-386
పశుపోషణ, మత్స్య విభాగం-353
జనరదల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ-343
ఇండస్ట్రీస్, కామర్స్-233
యూత్, టూరిజం, కల్చర్-184
ప్లానింగ్-136
పుడ్, సివిల్ సప్లయిస్-106
లిజిస్లేచర్-25
ఎనర్జీ-16
శాసనసభలో సిఎం మాట్లాడుతూ.. 95% స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సిఎం తెలిపారు . అటెండర్ నుండి ఆర్డీవో వరకు 95% స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 5% మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు.
ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు
పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పది సంవత్సరాలు పెంచాలని సర్కార్ నిర్ణయించిందని సిఎం ప్రకటించారు.
ఒసి వయోపరిమితి 44 ఏళ్లు,
ఎస్సి, బిసి. ఎస్టి వయోపరిమితి 49 ఏళ్లు,
దివ్యాంగులకు 54 ఏండ్ల కు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం:
FINAL CM SIR'S STATEMENT