INDW Vs WIW World Cup: వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండవ గెలుపు

హామిల్ట‌న్ (CLiC2NEWS): భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య‌ జ‌రిగిన మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ పోటీలో వెస్టిండీస్‌పై టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. 318 భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ జ‌ట్టు 162 పరుగుల‌కే ఆలౌట‌యింది. దీంతో మిథాలి సేన ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండో విజ‌యం సాధించింది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ .. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 317 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

వెస్టిండీస్ జ‌ట్టు ఆరంభంలో ఓపెన‌ర్లు 12 ఓవ‌ర్ల‌కే 100 ప‌రుగులు చేసి శుభారంభం చేశారు. కానీ మిగ‌తా బ్యాట‌ర్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. విండీస్‌ను టీమ్ ఇండియా బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. దీంతో ఆజ‌ట్టు 162 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది.

Leave A Reply

Your email address will not be published.