Britain: ఒక్క ఉక్రెయిన్ శ‌ర‌ణార్థి ఆశ్ర‌యం కోసం 450 డాల‌ర్లు!

ఉక్రెయిన్ నుండి 27 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు స‌రిహ‌ద్దులు దాటారు. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుండి త‌మ ప్రాణాలు కాపాడుకోవ‌డానికి వ‌చ్చిన శ‌ర‌ణార్థుల‌కు బ్రిట‌న్ లో ఆశ్ర‌యం క‌ల్పించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హోమ్స్ ఫ‌ర్ ఉక్రెయ‌న్ ప్రోగ్రామ్‌ను ప్ర‌క‌టించింది. బ్రిట‌న్ వాసులు ఎవ‌రైతే ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌కు వ‌స‌తి ఇచ్చి ఆశ్ర‌యం క‌ల్పిస్తే ప్ర‌భుత్వం ప్ర‌తినెల ఒక్కో శ‌రణార్థికి 450 డాల‌ర్లు చొప్పున చెల్లిస్తుంది. ఈ విష‌యాన్ని బ్రిట‌న్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ మిషెల్ గోవె వెల్ల‌డించారు.

ఎవ‌రైతే ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌కు క‌నీసం ఆరు నెల‌ల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారుల వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.