రైతుబజార్లలో వంటనూనె అమ్మకాలు..
అమరావతి (CLiC2NEWS): ఇటీవల అంతర్జాతీయ పరిణామాల కారణంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎపి రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా వంటనూనె విక్రయాలు చేపట్టింది. బహిరంగ మార్కెట్‌లో ధరలను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్ సేల్ , రిటైల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కృత్రిమ కొరత సృష్టించేవారి పట్ల కఠినంగా వ్యవహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సిఎస్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్‌లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. రైతు బజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు.