ఎపి శాసనసభ నుండి ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ నుండి సోమవారం ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగంపై చర్చకు అడ్డుపడుతున్నారని, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ టిడిపి శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయ స్వామిని సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.