ఈనెల 16 నుండి.. 12-14 ఏళ్ల పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌..

ఢిల్లి (CLiC2NEWS):  మార్చి 16వ తేది బుధ‌వారం నుండి 12-14 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు టీకా పంపిణీని ప్రారంభిస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం వెల్ల‌డించింది. దీంతో పాటు 60 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ ప్రికాష‌న్ డోసు అందించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను పంపిణీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 12-14 వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేష‌న‌ల్ టెక్నిక‌ల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్ ఇప్ప‌టికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించిన కేంద్రం.. బుధ‌వారం నుండి వ్యాక్సిన్ పంపిణీ చేయున‌ట్లుల వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.