గంభీరావుపేటలో పిల్లలతో సహా చెరువులోకి దూకిన తల్లి..
సిరిసిల్ల (CLiC2NEWS): సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపే మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి చెరువులోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. ముందుగా ఇద్దరుపిల్లలను తోసి ఆనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు చెరువులో నుంచి ఇద్దరు చిన్నారుల(అన్షిక-5 యేళ్లు, అభిగ్న -3యేళ్లు)లను వెలికితీశారు. తల్లి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ గొడవల వల్లనే పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.