78 ఏళ్ల బామ్మ వీలునామా.. 50 లక్షల విలువైన ఆస్తులు రాహుల్ గాంధీకే
డెహ్రాడూన్ (CLiC2NEWS): రాహుల్ గాంధీ మీదున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు ఓ బామ్మ. తనకున్న ఆస్థులన్నీ రాహుల్ గాంధీ పేరు మీద రాశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప ముంజియల్‌కు రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం. తన పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. సోమవారం పిసిసి మాజి చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లి, తన ఆస్తులు రాహుల్ పేరు మీదకు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. ఆయన అవసరం ఇప్పుడు దేశానికి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. ఈ వీలునామాను కోర్టులోనూ సమర్పించారు.
“దేశానికి స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు రాహుల్ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, ఆయన అభిప్రాయాలు, సిద్ధంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణానంతరం నా ఆస్తులన్నీ రాహుల్‌కే చెందేలా వీలునామా రాశాను, ఇదే విషయాన్ని కోర్టుకూ చెప్పాను” అని ఆమె తెలిపారు.