టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగలా జరుపుకోవాలి: కెటిఆర్
ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావలి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS) రాష్ట్రంలో ఈనెల 27వ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారు మాత్రమే హాజరు కావాలని మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని హెచ్ ఐసిసి వేదికగా జరగనున్న టిఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లో కలిసి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టిఆర్ ఎస్ ఏర్పడి 21 ఏళ్లు అయింది. హెచ్‌సిసిలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సభకు మూడు వేల మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నామని వారందరికీ పాసులు జారీ చేస్తామని తెలిపారు. మిగతా వారంతా గ్రామాలు, పట్టణాల్లో సంబురాలు జరుపుకోవాలని సూచించారు. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయలని, తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా టిఆర్ ఎస్ ఆవిర్భవించిందని కెటిఆర్ తెలిపారు.