బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారు..
లండన్ (CLiC2NEWS): బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 21 వ తేదీన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోకున్నారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. గుజరాత్‌కు రానున్న తొలి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నే.
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి, బోరిస్ జాన్సన్ ఇరు దేశాల మధ్య రక్షణ, దౌత్య, ఆర్ధిక భాగస్వామ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. బ్రిటన్, భారత్‌లో కీలక పరిశ్రమల్లో పెట్టుబడులపై ప్రకటనలు వెలువడనున్నాయని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ సంవత్సరం ఆరంభంలో ప్రారంభించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిపైనా ఇరు దేశాధినేతలు దృష్టిసారించనున్నారు.