వారంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్: ఆర్థిక మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వారంలో రోజులలో విడుదల చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని మంత్రి అన్నారు. సంగారెడ్డిలో సోమవారం పోలీసు శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు… తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తోందని అన్నారు. కేంద్రంలో దాదపు 15 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని మంత్రి నిలదీశారు. కేంద్రంలో ఉన్న పోస్టుల భర్తీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని ముఖ్యమంత్రి కెసిఆర్ మూడేళ్ల వరకు పెంచారన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని మంత్రి పేర్కొన్నారు. కాగా పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని మంత్రి హరీష్ తెలిపారు.