వారికి వెంట‌నే జీతాలివ్వండి.. ఎపి హైకోర్టు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎయిడెడ్ ఉపాధ్యాయులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమ‌వారం ఉన్న‌త న్యాయ‌స్థానంలో విచార‌ణ జ‌రిగింది. ప్ర‌భుత్వంలోకి తీసుకున్న త‌మ‌కు 8 నెల‌లుగా వేత‌నాలు చెల్లించ‌డం లేద‌ని ఎపి ఎయిడెడ్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నానికి వాద‌న‌లు వినిపించారు. ఎనిమిది నెల‌లుగా జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాద‌న‌లు విన్న ఉన్న‌త న్యాయ‌స్థానం త‌క్ష‌ణ‌మే పెండింగ్ జీతాలు చెల్లించాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.