బోల్తాప‌డిన కారులో భారీగా గంజాయి..

భ‌ద్రాద్రి  (CLiC2NEWS): కొత్త‌గూడెం జిల్లాలో కారు అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది. ప్రమాదానికి గురైన కారులో భారీగా గంజాయి బ‌య‌ట‌ప‌డింది. భ‌ద్రాద్రి జిల్లా సార‌పాక‌లోని భ‌ద్రాచ‌లం వంతెన స‌మీపంలో అదుపుత‌ప్పి వాహ‌నం బోల్తాప‌డింది. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని కారుతోపాటు గంజాయిని సీజ్ చేశారు. కారు డ్రైవ‌ర్, కారులోని వ్య‌క్తులు అప్ప‌టికే ప‌రారైన‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.