ప్రపంచంలో రెండవ బిజీ ఎయిర్పోర్ట్..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. అఫిషియల్ ఎయిర్‌లైన్ గైడ్ (ఒఎజి) నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాలలో మొదటి స్థానంలో అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్టు ఉండగా.. రెండవ స్థానంలో ఢిల్లీ విమానాశ్రయం రెండవ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్టును అధిగమించి రెండవ స్థానానికి చేరింది. 2019 అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 23వ స్థానంలో ఉంది.
మార్చి నెలలో అట్లాంటా విమానాశ్రయం నుండి 44 లక్షల మంది, ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుండి 36 లక్షలు, దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి 35 లక్షల మంది ప్రయాణం చేశారు.