ఫారెన్ లాంగ్యేజ్‌డిప్లొమా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా యూనివ‌ర్సిటి ప‌రిధిలో వివిధ విదేశీ భాష‌ల్లో డిప్లొమా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్ భాష‌ల్లో నాలుగు నెల‌ల జూనియ‌ర్‌, సీనియ‌ర్ డిప్లొమా కోర్సుల‌తో పాటు సంవ‌త్స‌రం వ్య‌వ‌ధితో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్స‌ల త‌ర‌గ‌తుల‌ను జులై 4వ తేదీ నుండి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది జులై 2. జూనియ‌ర్ డిప్లొమాలో చేరేందుకు ఇంట‌ర్ ఉత్తీర్ణులైఉండాలి.

Leave A Reply

Your email address will not be published.