Kavitha: ఒక అక్షరం కావాలి..
నీళ్ళు తోడేసిన సమస్యల బావిలా ఉంది మహిళ దేహం,
బతుకుబండి నెట్టుకు రావడం కష్టంగా ఉన్నా..
బిడ్డల కోసము ఊపిరి బిగబట్టి బ్రతుకుతుంది మహిళా..!
పిల్లల ఆకలి తీర్చడానికి గుక్కేడు గంజిలో ఉప్పు కోసం ఎండ అనక వాన అనక..
బతుకు రిక్షాను లాగుతూ ఊపిరి బిగబట్టి బ్రతుకుతుంది మహిళా..!
మహిళల బతుకులును మార్చుకోవడానికి ఒక అక్షరం కావాలి..!
మహిళా సాధికారత సాధించడానికి,
చరిత్రను తిరిగి రాయడానికి ఒక అక్షరం కావాలి..!
మహిళల బ్రతుకుల్లో చీకటి నుంచి వెలుగు రావాలని కోరుకుంటూ..
-మంజుల పత్తిపాటి