ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదలీలు..
సర్కార్ ఉత్తర్వులు జారీ
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపిఎస్ అధికారులను బదలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బదలీల వివరాలు..
- ఎల్కెవీ రంగారవు — క్రీడలు, సంక్షేమం విభాగం ఏడీజీగా అదనపు బాధ్యతలు
- ఎస్వీ రాజశేఖర్ బాబు — ఆక్టోపస్ డిఐజీ, శాంతిభద్రతలు డిఐజీ (అదనపు బాధ్యతలు)
- పిహెచ్డి రామకృష్ణ — ఎసిబి డిఐజీ , టెక్నికల్ సర్వీసెస్ డిఐజి (అదనపు బాధ్యతలు)
- కె.వి మోహన్‌రావు — పోలీసు శిక్షణ వ్యవహారాల డిఐజీ
- ఎస్ హరికృష్ణ — విశాఖ రేంజ్ డిఐజీ (ప్రస్తుత హోదా), కోస్టల్ సెక్యూరీటీ డిఐజీ (అదనపు బాధ్యతలు)
- గోపీనాథ్ జెట్టి — గ్రేహౌండ్స్ డిఐజీ, న్యాయ వ్యవహారాల ఐజిపి (అదనపు బాధ్యతలు)
- కోయ ప్రవీణ్ — 16వ బెటాలియన్ కమాండెంట్ ఆస్థానంలో పనిచేస్తున్న డి ఉదయభాస్కర్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు
- విశాల్ గున్నీ — 6వ బెటాలియన్ కమాండెంట్ (ప్రస్తుత హోదా) విజయవాడ రైల్వే ఎస్పీ (అదనపు బాధ్యతలు)
- రవీంద్రనాథ్ బాబు — కాకినాడ జిల్లా ఎస్పీ (ప్రస్తుత హోదా) ఎపిఎస్పీ 3వ బెటాలియన్ కామాండెంట్ (అదనపు బాధ్యతలు)
- అజితా వేజేండ్ల — అనంతపురంలో 14వ ఎపిఎస్పీ బెటాలియన్ కమాండెంట్ (ప్రస్తుత హోదా), గుంతకల్ రైల్వే ఎస్పీ (అదనపు బాధ్యతలు).. ఆ స్థానంలో పనిచేస్తున్న పి. అనిల్ బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు బదలీ.
- జి కృష్ణకాంత్ — రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్
- పాడేరు అదరనపు ఎస్పీ పి. జగదీశ్ చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదలీ
- తుహీన్ సిన్హా — పాడేరు అదనపు ఎస్పీగా అడ్మిన్‌గా బదలీ.
- బిందు మాధవ్ గరికపాటి — పల్నాడు జిల్లా అనపు అడ్మిన్ ఎస్పీగా బదలీ
- పివి రవికుమార్ — విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా బదలీ