ఎఫ్3లో జిగేల్‌రాణి ప్ర‌త్యేక గీతం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా క‌లిసి న‌టిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రంలో పూజాహెగ్దే ప్ర‌త్యేక గీతంతో సంద‌డి చేయ‌బోతుంది. తాజాగా చిత్ర బృందం ఆ పాట‌ను విడుద‌ల‌ చేసింది. ‘అధ్య‌క్షా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల‌..’ అంటూ సాగే ఈ పాట‌లో పూజాహెగ్దేతో పాటు క‌థానాయ‌కులు వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌లిసి స్టెప్పులేశారు. కాస‌ర్ల శ్యామ్ ర‌చించిన ఈ పాట‌ను రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆల‌పించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కు సీక్వెల్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిన‌దే. ఈ సినిమా మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave A Reply

Your email address will not be published.