సిద్ధూ@ ఖైదీ నం.241383

ప‌టియాలా (CLiC2NEWS): ర్యాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు యేడాది జైలు శిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిద్ధూ నిన్న (శుక్ర‌వారం) కోర్టులో లొంగిపోయారు. దీంతో అధికారులు ఆయ‌న‌ను ప‌టియాల సెంట్ర‌ల్ జైలు కు త‌ర‌లించారు. జైలు లోప‌ల సిద్ధూకు ఖైదీ నం. 241383 కేటాయించారు. కాగా జైల్లో సిద్ధూ కాస్ట క‌ష్టంగానే గ‌డిచిన‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

సిద్ధూకు జైలులో ఓ టెబుల్, కుర్చీ, రెండు ట‌ర్బ‌న్లు, ఓ క‌ప్‌బోర్డు, బ్లాంకెట్‌, రెండు ట‌వ‌ల్స్ , దోమ‌తెర‌, ఓ పెన్ను, నోట్బుక్‌, షూలు, రెండ్ బెడ్‌షీట్లు, నాలుగు జ‌త‌ల కుర్తా పైజామా సిద్ధూకు ఇచ్చారు. సిద్దూ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని జైలు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.