వైఎస్ఆర్‌సిపి పార్టీ నుండి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్..!
అమరావతి (CLiC2NEWS): డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును పార్టీ నుండి స్పస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్ ఆర్ సిపి ప్రకటించింది. సిఎం జగన్ ఆదేశాల మేరకు వైఎస్ ఆర్ సిపి కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు సమాచారం. అనంతబాబును ఇప్పటికే పోలీసులు ఆరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.