Hyderabad: హోటల్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ (CLIC2NEWS): నానక్ రామ్ గూడ లోని ఒక హోటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  భారీగా మంటలు ఎగసి పడుతన్నాయి.  ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగసి పడటం తో సిబ్బంది, జనం బయటకు పరుగులు తీశారు.  పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్ సహాయంతో పలువురిని కిందికి దించాడు.  

మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌చ్చిన‌ట్లు అగ్నిమాప‌క సిబ్బంది తెలిపారు. ఇంకా భ‌వ‌నంలో ఎవ‌రైనా చిక్కుకున్నారేమో అని గాలిస్తున్నారు. రెండో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగి పై అంత‌స్తుకు వ్యాపించిన‌ట్లు అధికారులు తెలిపారు. బారీ స్కై లిఫ్ట్ సాయంతో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.