‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ వచ్చేసింది..
హైదరాబాద్ (CLiC2NEWS): నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం అంటే.. సుందరానికీ. ఈ చిత్రం జూన్ 10వ తేదీ నుండి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. దీనిలో చూపించిన ప్రతీ కారెక్టర్ నవ్వులు పూయిస్తున్నారు. ముఖ్యంగా నాని నటన అద్భుతంగా వుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా, నరేశ్, రోహిణి, హర్షవర్థన్ రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.