నిఖత్ జరీన్, ఇషాసింగ్‌కు సిఎం కెసిఆర్ ఆతిథ్యం
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 కోట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నగదును అందించారు. అనంతరం ప్రగతి భవన్లో వారిరువురిని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. నిఖత్ జరీన్, ఇషాసింగ్, వారి కుటుంబసభ్యులతో కలిసి లంచ్ చేశారు.