రాష్ట్రంలో మరో 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల్లో మరో 1,433 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 657 ఎఇఇ, 113ఎఇ, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎఎస్ఒ.. తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.