తిరుపతిలో ప్రత్యేక కోర్టులను ప్రారంభించిన సిజెఐ
తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గురువారం ప్రారంభించారు. నగరంలో ఆల్ ఇండియా రేడియో కార్యలయం సమీపంలోని తుడా కాంప్లెక్స్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల విచారణ నిమిత్తం రెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అనంతరం జస్టిస్ ఎన్వి రమణ ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్హాల్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ జిల్లా న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు.