సోనూ.. నీ గొప్ప మ‌న‌సుకు హాట్సాఫ్‌!

ముంబ‌యి (CLiC2NEWS): క‌రోనా స‌మయం నుండి అడిగిన వారికి కాద‌న‌కుండా స‌హాయం చేస్తున్న సోనూసూద్‌.. మ‌రోసారి ఓ చిన్నారికి ఆర్ధిక సాయం అందించి కొత్త జీవితం ప్ర‌సాదించాడు. బిహార్‌కు చెందిన చౌముకి కుమారి అనే చిన్నారి అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతుంది. పుట్టుక‌తోనే ఆ చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతుల‌తో జ‌న్మించింది. ఆమె గురించి తెలుసుకున్న సోనూసూద్‌..ఆమెకు చికిత్స చేయిస్తాన‌ని ఇటీవ‌ల మాట ఇచ్చారు. ఆ చిన్నారికి ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైంద‌ని తెలియ‌జేస్తూ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫొటోల‌ను షేర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.