విజయకాంత్ మూడు కాలివేళ్ల తొలగింపు!
చెన్నై (CLiC2NEWS): మధుమేహం కారణంగా ప్రముఖ తమిళనటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి వేళ్లలో మూడింటిని తొలగించారు. ఈ మేరకు డిఎండికె పార్టీ కార్యాలయం తరఫున మంగళవారం ఒక ప్రకటన వెలువడింది.
ఆ ప్రకటనలో `కొంతకాలంగా విజయకాంత్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి మూడు వేళ్లకు రక్తం సరఫరా కావడంలేదు. సోమవారం వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.’ అని వెల్లడించారు.