HMDA: రేపటి నుండి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
హైదరాబాద్ (CLiC2NEWS): బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) నోటిఫికేషన్ ఇవ్వగా భారీ స్పందన లభించింది. రేపటి నుండి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్లు వచ్చాయి. బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్‌రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం అత్యధికంగా 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లాటరీ ప్రక్రియ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. జూన్ 27వ తేదీన పోచారం, 28 వ తేదీన బండ్లగూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్‌రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా తీయనున్నారు.