ఆత్మకూరు ఉపఎన్నిక: విక్రమ్ రెడ్డి ఘన విజయం
ఆత్మకూరు (CLiC2NEWS): నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసినదే. ఇవాళ ఓట్ల లెక్కింపు మొదలైన ప్పటి నుండి వైఎస్ ఆర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపోటి విక్రమ్ రెడ్డి తన ప్రత్యర్థులపై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్ల లెక్కింపు చేపట్టగా.. ప్రతి రౌండ్లోనూ విక్రమ్ రెడ్డి ఆధిక్యంతో కొనసాగారు. 15 రౌండ్ లెక్కింపు ముగిసేసరికి 76,096 ఒట్లు దర్కించుకోవడంతో ఆయన విజయం ఏకపక్షమని తేలిపోయింది. 20 రౌండ్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత విక్రమ్‌రెడ్డి 1,02,074 ఓట్లను దక్కించుకున్నారు. తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్‌పై 82,742 ఒట్ల మెజారిటీతో ఆత్మకూరు ఉప ఎన్నికను విక్రమ్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.