‘మనసానమః’ లఘు చిత్రానికి గిన్నిస్ రికార్డ్..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు సినిమా గర్వించేలా అరుదైన రికార్డు నమోదైంది. దీపక్‌రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం మనసానమః గిన్నిస్ రికార్డ్ సాధించింది. అత్యధికంగా 513 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసాపత్రాన్ని అందించింది. రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ బరిలోనూ నిలిచింది.