బ‌ల ప‌రీక్ష‌పై గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించిన `సుప్రీం`

న్యూఢిల్లీ (CLiC2NEWS): మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే స‌ర్కార్ శాస‌న స‌భ‌లో గురువారం ప‌రీక్ష ఎదుర్కోవాల‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కోశియారి నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. కాగా బ‌ల‌ప‌రీక్ష ను స‌వాల్ చేసిన శివ‌సేన‌కు కోర్టులో ఎలాంటి ఊర‌ట ల‌భించ‌లేదు. రాజ‌కీయ సంక్షోభాల‌కు ఫ్లోర్ ప‌రీక్ష ఒక్క‌టే మార్గ‌మ‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది.

శివ‌సేన త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ ఈ కేసును అత్య‌వ‌స‌రంగా విచార‌ణ జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టును బుధ‌వారం కోరారు. దీంతో జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, బేబీ పార్ధివాలాతో కూడిన వెకేష‌న్ బెంచ్ బుధ‌వారం సాయంత్రి ఈ వాజ్యంపై విచార‌ణ జ‌రిపింది. ఈ కేసులు ఇరు వ‌ర్గాలు సుమారు మూడుగంట‌ల‌కు పైగా వాద‌న‌లు జ‌రిగాయి. బ‌ల ప‌రీక్ష‌ను ఒక వారానికి వాయిదా వేయాల‌ని కోరారు. లేదా అన‌ర్హ‌త నోటీసుల‌పై స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని అనుమ‌తించే వీలుగా ఆ విచార‌ణ ముందుకు జ‌రుపాల‌ని కోర్టును కోరారు.

శివ‌సేన రెబెల్ నాయ‌కుడు షిండే వ‌ర్గం త‌రఫున న్యాయ‌వాది నీర‌జ్ కిష‌న్ కౌల్ వాద‌న‌లు వినిపించారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త ప్ర‌క్రియ లేదా ఎమ్మెల్యేల రాజీనామాలు బ‌ల ప‌రీక్ష ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం కాకూడ‌ద‌ని అన్నారు. దీనికి సంబంధించి గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆయ‌న కోర్టు ముందుంచారు. ఎంఎవి స‌ర్కార్ మైనారిటీలో ప‌డిపోయిన అధికారంలో ఉండేందుకు య‌త్నిస్తున్న‌ద‌ని నీర‌జ్ కిష‌న్ విమ‌ర్శించారు. షిండే వ‌ర్గం అస‌మ్మ‌తి వ‌ర్గం కాద‌ని నిజ‌మైన శివ‌సేన అని ఆయ‌న తెలిపారు. 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది షిండేకు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని చెప్పారు.

మ‌రో వైపు గ‌వ‌ర్న‌ర్ త‌ర‌ఫున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స్పీక‌ర్‌ను సుప్రీంకోర్టు అడ్డుకోలేద‌ని.. ఆ ప‌ని చ‌ట్టం చేసింద‌ని తెలిపారు. ఫ్లోర్ ప‌రీక్ష‌కు ఆదేశాలు ఇవ్వ‌క‌పోతే విధినిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం జ‌రుగుతుంద‌ని మెహ‌తా అన్నారు.

చివ‌ర‌గా మూడుగంట‌ల పాటు విద‌న‌లు విన్న సుప్రీంకోర్టు చివ‌ర‌కు బ‌ల‌ప‌రీక్ష‌కే మొగ్గు చూపింది.
“అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వ‌డానికి హౌస్ ఆఫ్ ఫ్లోర్ మాత్ర‌మే మార్గ‌మ‌ని మేం భావిస్తున్నాం. తిరుగుబాటు ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటు పై దాఖ‌ల‌లైన పిటిష‌న్‌ను కోర్టు ప్ర‌త్యేకంగా విచారిస్తుంది“ అని కోర్టు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.