ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రలిమినరీ ఎగ్జామ్ డేట్స్ ప్రకటన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించే డేట్స్ను బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ ఐ, ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న్లట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం వెల్లడించింది. ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
PressNoteDated04072022
ఎస్ ఐ రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 వ తేదీ నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వెబ్సైట్ https://www.tslprb.in/ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
తెలంగాణ సర్కార్ ఆయా నోటిఫికేషన్ల ద్వారా 554 ఎస్ ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 52న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది.