rain effect: ఈనెల 13 వ‌ర‌కు ప‌లు రైళ్లు ర‌ద్దు

హైద‌రాబాద్ (CLiC2NEWS): భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చ‌ర్య‌ల‌పై ఇన్‌చార్జి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అరుణ్‌కుమార్ జైన్ సికింద్రాబాద్‌లోని రైల్ నిల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్షలో వివిధ విభాగాల ఉన్న‌తాధికారుల‌తో పాటు విజ‌య‌వాడ‌, గుంత‌క‌ల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైద‌రాబాద్‌, నాందేడ్ డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్లు వెబ్ కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. రైళ్ల రాక‌పోక‌ల స‌మ‌యాల్లో మార్పులు ఉంటే ప్ర‌యాణం చేసేవారికి తాజా స‌మాచారాన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించే విధం గా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు రైళ్లు రద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టింంచింది. ఈ నెల 11 నుంచి 13 వ‌ర‌కు సికింద్రాబాద్‌-ఉందాన‌గ‌ర్‌-సికింద్రాబాద్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్‌-ఉందాన‌గ‌ర్‌, మెము రైలు, మేడ్చ‌ల్‌- ఉందాన‌గ‌ర్ మెము ప్ర‌త్యేక రైలు, ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాదు మెము స్పెష‌ల్ రైలు, సికింద్రాబాద్‌-ఉందాన‌గ‌ర్ మెము స్పెష‌ల్ రైలు, హెచ్‌.ఎస్ నాందేడ్‌-మేడ్చ‌ల్ -హెచ్ ఎస్ నాందేడ్‌, సికింద్రాబాద్‌-మేడ్చ‌ల్ మెము రైలు, మేడ్చ‌ల్ – సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖ‌ప‌ట్ట‌ణం మెము రైలు, విజ‌య‌వాడ‌-బ‌ట్ర‌గుంట మెము రైలును ర‌ద్దుచేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది.

వ‌ర్షాల కార‌ణంగా ఈ నెల 11 నుంచి 13 వ‌ర‌కు 34 ఎంఎంటిఎస్ స‌ర్వీసులు ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.