సీజ‌న‌ల్ వ్యాధుల‌తో జాగ్ర‌త్త‌: డిహెచ్ శ్రీ‌నివాస‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): భారీ వ‌ర్షాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌ల‌కు సూచించారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. గ‌త వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. 0ఆహారం, నీరు క‌లుషితం కాకుండా ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌భ‌లే అవ‌కాశ‌మున్న నేప‌థ్యంలో డిఎంహెచ్ వోల‌తో వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు స‌మావేశం నిర్వ‌హించి స‌న్న‌ద్ధ‌త‌పై ఆదేశౄలు ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు.

“బ్యాక్టిరియా, వైర‌స్ తో సీజ‌న‌ల్ వ్యాధులు వ‌స్తాయి. వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో అత్యంత అవ‌స‌ర‌మైతేనే ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావాలి. క‌రోనా కు ముందు 2019 లో వేల‌ల్లో డెంగీ కేసులు వ‌చ్చాయి. అప్ప‌డు కొన్ని మ‌ర‌ణాలు కూడా న‌మోద‌య్యాయి. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టి వ‌ర‌కు 1184 డెంగీ కేసులు వ‌చ్చాయి. వీటిలో భ‌ద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే కాస్త ఎక్కువుగా న‌మోద‌వుతున్నాయి. అలాగే ఈ సంవ‌త్స‌రం టైఫాయిడ్ కేస‌లు కూడా అధికంగా న‌మోద‌వుతున్నాయి. మేలో 2700, జూన్‌లో 2752 కేసులు వ‌చ్చాయి. మంచి ఆహారం, మంచి నీరు తీసుకోవ‌డం వ‌ల్ల ప్రజ‌లు ఈ వ్యాధుల నుంచి సుర‌క్షితంగా బ‌ట‌య ప‌డొచ్చు. జ‌లుబు, జ్వ‌రం , విరేచ‌నాలు ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించాలి“ అని శ్రీ‌నివాస‌రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.