హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరమ్మత్తు పనులు వాయిదా… మంచినీటి సరఫరా యథాతథం
హైదరాబాద్ (CLiC2NEWS): భాగ్యనగర వాసులకు జలమండలి గుడ్‌న్యూస్ చెప్పింది. నగరంలో చేపట్టిన మరమ్మత్తు పనులు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మంచినీటి సరఫరాను యథాతథంగా అందిస్తున్నట్లు హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎడతెరిపిలేని వర్షాలతో నగరవాసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచినీటి సరఫరా బంద్ అంటూ ప్రకటించిన జలమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 1కి సంబంధించిన జంక్షన్ పనుల కోసం బుధవారం (తేదీ: 13.07.2022) ఉదయం 6 గంటల నుండి గురువారం (14.07.2022 ) సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించింది.
కేడీడబ్ల్యూఎస్పీ ఫేజ్ – 2, 3కి సంబంధించి కూడా బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మూడు గంటల పాటు పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ప్రకటించింది. అయితే నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి సరఫరా పనులు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జలమండలి అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. మరమ్మత్తులు చేపట్టే తేదీలను తిరిగి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Have you ever considerеd creating ɑn e-book ⲟr guest authoring օn other blogs?
I have a blog based upon on thе same topics ʏou
discuss and would love to һave you share somе stories/іnformation. Ι know my audience would vɑlue your work.
If үou are even remotely interеsted, feel free tⲟ
shoot me an e-mail.