ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి నీటి విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణటక, మహారాష్ట్ర, గుజరాత్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద ముంచెత్తుతోంది. ఎగువతో పాటు గోదావరి నీదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. దీంతో భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 33 గేట్లను ఎత్తి 4,15,338 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణ,ఒడిశా-ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అప్పపీడనం ఇవాళ (మంగళవారం) తీవ్ర అల్ప పీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతారణ కేంద్ర వెల్లడించింది. ఈ అల్పపీడనం ఓడివా తీర ప్రాంతాల్లో కేంద్రీకృమై ఉందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. దీనికి అనుంబంధంగా ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మేర వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇవాళ అత్యంత భారీ వర్షం కురువనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.