AP: ఉగ్రగోదావరి.. అధికారులకు సిఎం జగన్ కీలక ఆదేశాలు
అమరావతి (CLiC2NEWS): భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, ఉపనదుల ద్వారా వచ్చి చేరుతున్న వరద నీరుతో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది ఎపి సర్కార్. ఇవాళ (మంగళవారం) కోస్తా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చరర్యలు ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశింంచారు. రేపటి వరకు 15 నుంచి 16 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు.