హైద‌రాబాద్‌కు ఈదురుగాలుల‌తో వ‌ర్ష సూచ‌న‌

Rain forecast for Hyderabad with gale force winds

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ లో బ‌ల‌మైన ఈదురుగాలుల‌తో ఇవాళ (బుధ‌వారం) భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఎక్కువ తీవ్ర‌త‌తో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని జిహెచ్ ఎంసి అధికారులు హెచ్చ‌రించారు. చెట్ట కింద ఉండొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. వాహ‌నదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. అత్య‌వ‌స‌ర స‌హాయం కోసం డిఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో న‌గ‌ర వాసుల‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్త‌కుండా జిహెచ్ ఎంసి అధికారులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లుచేప‌డుతున్న‌ది. జోన్ క‌మిష‌న‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్‌, శానిటేష‌న్‌, ఇంజినీరింగ్‌, యుబిడి, డిఆర్ ఎఫ్‌, ఎట‌క్ట్రిసిటీ.. త‌దిత‌ర శాఖ‌ల స‌మ‌న్వ‌యం తో స‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ ప‌రిష్కారం చేస్తున్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఏవైనా స‌మ‌స్య‌లు ఎదురైతే కంట్రోల్ రూం.నం. 040-21111111కి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.