క‌డెం ప్రాజెక్టు ప‌రిస్థితిపై సిఎం కెసిఆర్ ఆరా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): భారీ వ‌ర్షాల‌తో క‌డెం ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తుతున్న‌ది. వ‌ర‌ద ఉగ్ర‌రూపం దాట్చ‌డంతో సామ‌ర్థ్యం కంటే అధికంగా వ‌ర‌ద నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతోంది. క‌డెం ప్రాజెక్టు పూర్థి స్థాయి సామ‌ర్థ్యం 3 ల‌క్ష‌ల క్యూసెక్కులు. ప్ర‌స్తుతం 5 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు జ‌లాశ‌యానికి వ‌స్తున్న‌ది. దీంతో 1995 త‌ర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వ‌ర‌ద రావ‌డం ఇదే మొద‌టి సార‌ని అధికారులు తెలిపారు.
భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌టంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ‌కు నీటి ని కిందికి వ‌దులుతున్నారు. మొత్తం 18 గేట్ల‌లో 17 గేట్లు తెరిచి నీటిని కిందికి వ‌దులుతున్నారు. మిగ‌తా ఒక్క గేటు సాంకేతిక‌కార‌ణాల‌తో తెర‌వ‌లేక‌పోయారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ప్రాజెక్టు వ‌ద్దే ఉండి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. కాగా వ‌ర‌ద ఉధృతి, క‌డెం ప్రాజెక్టు ప‌రిస్థితిపై సిఎం కెసిఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌కు ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌లను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.