ఎంసెట్ అగ్రికల్చరల్ స్ట్రీమ్ పరీక్ష వాయిదా
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ నెల 14, 15 తేదీలలో జరగాల్సి ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీ మ్ పరీక్షను వాయిదా వేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ పరక్షను నిర్వహించే తేదీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం నిర్ణయించిన 18-20 తేదీల్లో ఆ పరీక్ష యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
