పునరావాస కేంద్రాలకు 19 వేల మంది తరలింపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ, ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ (గురువారం) హైదరాబాద్‌లో వరదలు, సహాయం, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష చేశారు. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం అధికారులతో సిఎస్ సమీక్ష చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.