క‌డెం ప్రాజెక్టు త‌ప్పిన ముప్పు.. త‌గ్గిన వ‌ర‌ద‌

క‌డెం (CLiC2NEWS): గ‌త వారం రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో తెలంగాణ‌లోని గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. భారీ వ‌ర‌ద‌ల‌తో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిర్మ‌ల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ముప్పుత‌ప్పింది. ఎగువ‌న కురిసిన భారీ వ‌ర్షాల‌తో క‌డెం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌నీరు వ‌చ్చి చేరింది. నిన్న (బుధ‌వారం ) భారీగా వ‌ర‌ద నీరు పోటెత్తింది. ఇన్ ఫ్లోకు త‌గిన‌ట్లుగా ఔట్ ఫ్లో లేక‌పోవ‌డంతో ప్రాజెక్ట‌కు క‌ట్ట‌ల‌పై నుంచి వ‌ర‌ద నీరు ప్ర‌మాద‌క స్థాయిలో ప్ర‌వ‌హించింది. దీంతో ఎప్పుగు ఏం జ‌రుగుతుందో అని అధికార‌లు, ప్ర‌జ‌లు తీవ్రం ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కాగా ఇవాళ (గురువారం) వ‌ర‌ద ఉధృతి త‌గ్గ‌డంతో అధికారులు, ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు ప్రాజెక్టు వ‌ద్ద ఉండి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌క‌ప్పుడు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయిని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.