మెక్సికొలో కూలిన సైనిక హెలికాప్టర్.. 14 మంది మృతి
మెక్సికో (CLiC2NEWS): మెక్సికలో సిటీలో సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 14 మంది మరణించారు. కా గా ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు మెక్సికో నావికాదళం మీడియాకు వెల్లడించింది. మెక్సికో సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారని తెలిపారు. కాగా ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలాయరాలేదని అధికారులు తెలిపారు.