పోలీసు స్టేష‌న్‌లో చొర‌బ‌డి కానిస్టేబుల్‌ను చుట్టుముట్టి దాడి!

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏకంగా ఓ అల్ల‌రి మూక పోలీసు స్టేష‌న్‌లో చొర‌బ‌డి కానిస్టేబుల్‌పై దాడికి పాల్ప‌డింది. ఆల‌స్యంగా ఈ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దాదాపు 10-12 మంది వ్య‌క్తులు ఢిల్లీలోని ఆనంద్ విహార్ పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చారు. హెడ్‌కానిస్టేబుల్‌ను చుట్టుముట్టారు. హెడ్‌కానిస్టేబుల్‌పై దుర్బాష‌లాడుతూ దాడికి పాల్ప‌డ్డారు. ఒక చేతితో కానిస్టేబుల్ కాల‌ర్ ప‌ట్టుకొని మ‌రో చేతితో ఆయ‌న పై దాడికి పాల్ప‌డ్డాడు. ఇంత జ‌రుగుతున్న తోటి కానిస్టేబుళ్లు జోక్యం చేసుకోలేదు. చోద్యం చూస్తూ ఉండి పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ దాడిని తోటి పోలీసులు అడ్డుకోకుండా వీడియో తీయం విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఆ విడియోలు వైర‌ల్‌గా మారాయి. ఈ నెల 3వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న వైర‌ల్ గా మారి ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్ల‌డంతో… వారు దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. వియోల ఆధారంగా దాడి చేసిన వ్య‌క్తుల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.