తిరుపతి జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం!
తిరుపతి (CLiC2NEWS): తిరుపతి జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్యవేడు నియోజకవర్గంలోని కెవిబిపురం మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలికకు ముగ్గురు యువకులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లినట్లు బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారించగా.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా నిందితులు ఫరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.