సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈనెల 22వ తేదీ వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ అల్ప‌పీడ‌నం కార‌ణంగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం స‌ముద్ర‌మ‌ట్టానికి 5.8 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ అల్ప‌పీడ‌నం వాయువ్య‌దిశ‌గా ఒడిశా తీరం వైపు క‌దులుతూ 24 గంట‌ల్లో మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీని ప్ర‌భావంతో రాష్ట్రవ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.