ఎన్టిఆర్ పేరు మార్చడం.. ఆయనను అవమానించడమే: పురందేశ్వరి
అమరావతి (CLiC2NEWS): ఎన్టిఆర్ యూనివర్సిటి పేరు మార్చడంపై బిజెపి జాతీయ కార్యదర్శి పురందేశ్వరి స్పందించారు. దివంగత నేత ఎన్టిఆర్పై గౌరవం ఉందని చెబుతూనే.. డా. ఎన్టిఆర్ విశ్వవిద్యాలయం పేరును మార్చడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఎన్టిఆర్ సామాజిక వైద్యుడని అభివర్ణించారు. కారణం లేకుండా పేరును మార్చడం ఆయనకు జరిగిన అవమానమేనని ఆమె అన్నారు. వైఎస్ ఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతామని.. ప్రభుత్వ విధానాలపై ప్రజా పోరాటం చేస్తామని అన్నారు.