చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు భగత్‌సింగ్ పేరు: ప్రధాని మోడీ
ఢిల్లీ (CLiC2NEWS): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పేరును చండీగఢ్ ఎయిర్‌ఫోర్టుకు పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడి వెల్లడించారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ ప్రసంగించారు. సెప్టెంబర్ 28వ తేదీన భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా విమానాశ్రయానికి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. భగత్‌సింగ్‌కు మరింత గౌరవం కల్పించే ఉద్దేశ్యంతో ఆయన జయంతి వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.